Google
 Google సహాయ కేంద్రం
Google హోం

Google గురించి

సహాయ కేంద్రం
  శోధన యొక్క మూలాలు
  ఉన్నతమైన శోధన
  శోధన ఫలితాల పేజి
  ప్రాధాన్యతల స్థాపన


శోధన లక్షణాలు
స్పెల్ చెకర్, స్టాక్ ధరలుచెప్పు మరియు మరిన్ని

సేవలు మరియు పరికరాలు
స్థానిక శోధన, ఉత్పాదనల శోధన, వార్తలు మరియు మరిన్ని

ఈ సైట్ పై పొందండి:

  Google వెబ్ శోధన లక్షణాలు

బిలియన్లకొద్ది వెబ్ పేజీలను సులువుగా పొందే వీలు కల్పించడంతోపాటు, మీకు కావలసినదేదో నిక్కచ్చిగా పొందడానికి వీలు కలిగించే అనేక ప్రత్యేక సదుపాయాలను Google కలిగి ఉంది. దీనిగురించి మరింత తెలుసుకోవడానికి నిర్దిష్ట సదుపాయం యొక్క టైటిల్ ని క్లిక్ చెయ్యండి.

  పుస్తక శోధన

పుస్తకాలలోని పూర్తి పాఠాన్ని శోధించడానికి Google ని ఉపయోగించండి.

  భద్రపరిచినది

మేము ఇండెక్స్ చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ప్రతి పేజి యొక్క స్నాప్ షాట్ ని చూడండి.

  కాలిక్యులేటర్

గణాంకాలలో సమస్యలను పరిష్కరించడానికి Google ని ఉపయోగించండి.

  కరెన్సీ కన్వర్షన్

ఏదైనా కరెన్సీ కన్వర్షన్ ని సులువుగా చెయ్యండి.

  నిర్వచనాలు

పలు ఆన్ లైన్ సేవలనుంచి సేకరించిన గ్లాసరీల నిర్వచనాలు పొందడానికి Google ని ఉపయోగించండి.

  ఫైల్ రకాలు

PDF ఫైల్ ఫార్మాట్ లతో కలిపి నాన్ HTML ఫైల్ ఫార్మాట్ ల కోసం శోధించండి.

  గ్రూపులు

మీరు రెగ్యులర్ గా చేసే వెబ్ శోధన ఫలితాలలో Google గ్రూపులనుండి వచ్చే పోస్టింగులను చూడండి.

  నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నా

మా ఫలితాలను బైపాస్ చెయ్యడానికి మరియు మీ ప్రశ్నకు లభించిన మొదటి పేజికి వెళ్లండి.

  చిత్రాలు

మీ రెగ్యులర్ వెబ్ శోధన ఫలితాలలో సంబంధిత చిత్రాలను చూడండి.

  స్థానిక శోధన

యుఎస్.,యుకె, మరియు కెనడాలలో స్థానిక వ్యాపారాలు మరియు సేవలను శోధించండి.

  సినిమాలు

మీ సమీపంలో ప్రదర్శింపబడుతున్న సినిమాల రివ్యూలు మరియు ప్రదర్శన వేళలను తెలుసుకోవడానికి Google ని ఉపయోగించండి.

  సంగీత శోధన

విస్తృత సంగీత సమాచారాన్ని త్వరగా పొందడానికి Google ని ఉపయోగించండి.

  వార్తల ముఖ్యాంశాలు

తాజా వార్తా వ్యాఖ్యలతో మీ శోధన ఫలితాలను మెరుగుపరుచుకోండి.

  ఫోన్ బుక్

అమెరికాలో వీధి చిరునామా మరియు ఫోన్ నెంబర్ సమాచారం కోసం చూడండి.

  ఉత్పాదనల శోధన

ఒక ఉత్పాదనని ఆన్ లైన్ లో అమ్మడానికి, Google ఉత్పాదన శోధనను ఉపయోగించండి.

  ప్రశ్నలు మరియు జవాబులు

నేరుగా అడిగే ప్రశ్నలకు త్వరగా సమాధానాలను Google నుండి పొందండి.

  మీ శోధనను పునః పరిశీలించండి - కొత్త!

మీ ఫలితాలపై దృష్టి పెట్టి వాటిని మెరుగు పరచుకోవడానికి త్వరిత సమాచారం మరియు విషయాధార లింకులను మీ శోధనలో చేర్చండి.

  ఫలితాలు రావడానికి ముందు

ఫైర్ ఫాక్స్ శోధనని వేగవంతం చేస్తుంది.

  సంఖ్యతో శోధించు

పేకేజ్ ట్రాకింగ్ సమాచారం, అమెరికా పేటెంట్స్, మరియు ఆన్ లైన్ డేటాబేస్ లోని రకాలను చేర్చడంకోసం Google ని ఉపయోగించండి.

  పోలిన పేజీలు

ఒక ప్రత్యేకమైన ఫలితానికి సంబంధించిన పేజీలను ప్రదర్శించు.

  సైట్ శోధించు

మీ శోధనను ఒక నిర్దిష్టమైన సైట్ కి పరిమితంచెయ్యి.

  స్పెల్ చెకర్

ప్రశ్నలకు ప్రత్యామ్నాయ స్పెల్లింగ్ ఎంపికలు.

  స్టాక్ మరియు ఫండ్ ధర తెలపడం

స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్ ధరలు తెలపడం మరియు తాజా సమాచారం కొరకు Google ని ఉపయోగించు.

  వీధి మ్యాప్ లు

అమెరికాలో వీధి మ్యాప్ లు చూడడంకోసం Google ని ఉపయోగించు.

  ప్రయాణ సమాచారం

అమెరికాలో ఒక ఎయిర్ లైన్ విమాన స్ధితిని పరిశీలించు లేదా ఎయిర్ పోర్ట్ ఆలస్యం మరియు వాతావరణ స్థితిగతులను చూపు.

  వాతావరణం

అమెరికాలోని ఏ ప్రాంతానిదైనా ప్రస్తుత వాతావరణ స్థితిని మరియు భవిష్య వాతావరణ సమాచారం కొరకు పరిశీలించు.

  • వెబ్ పేజ్ అనువాదం 

ఇతర భాషలలోని వెబ్ పేజీలకు చేర్చు.

  మీకు ఎవరు కలిశారు ?

ఒక నిర్దిష్ట URLని చూపించే పేజీని చూపించు.


పుస్తక శోధన

ముద్రణ పుస్తకాలనే ఆన్ లైన్ లోకి తేవడంద్వారా ప్రపంచ సమాచారం ఆన్ లైన్ లో పొందడానికి Google సహాయపడుతోంది. మీ శోధన పదాలకు సరిపోయే సమాచారం మా Google పుస్తక శోధన విషయసూచికలో కనబడినప్పుడు, ఆ పుస్తకాలకు లింకులను మీ శోధన ఫలితాల పేజీలోని పైభాగంలో పుస్తక ఫలితాలలో మీరు గమనిస్తారు. ఏ పుస్తకం పేరుమీద క్లిక్ చేసినా ఆ పుస్తకంలోని మీ శోధన పదాలు ఉన్నపేజీని మరియు ఆ పేరు గురించిన ఇతర సమాచారాన్ని మీరు చూస్తారు. "ఈ పుస్తకాన్ని కొను" లోని లింకులలో ఒక దానిని క్లిక్ చేసినట్లయితే మీరు నేరుగా ఆన్ లైన్ లో ఆ పుస్తకం విక్రయించే పుస్తకాల దుకాణానికి వెళతారు.

ఉదాహరణ:  

భద్రపరిచిన ???????

వెబ్ ని క్రాల్ చేస్తున్నపుడు Google పరిశీలించిన ప్రతి పేజీని స్నాప్ షాట్ తీసుకుంటుంది మరియు అసలు పేజీ దొరకనపుడు వీటిని బ్యాక్ అప్ లా వాడుకుంటుంది. "భద్రపరచిన " లింకును మీరు క్లిక్ చేసినట్లయితే, మేము విషయసూచికలో ఏ విధంగా పొందుపరిచామో అదే విధమైన వెబ్ పేజీని మీరు చూస్తారు. భద్రపరచిన విషయాన్నే ఉపయోగించి మీరు అడిగే ప్రశ్నకు సరైన సమాధానం అవునో కాదో Google నిర్ణయిస్తుంది.

భద్రపరచిన పేజీ ప్రదర్శింపబడినప్పుడు, దాని పైభాగంలో ఇది ఈపేజీ యొక్క అత్యంత తాజా వెర్షన్ కావలసిన అవసరం లేదు అని రిమైండర్ గా పనిచేసే ఒక హెడర్ ఉంటుంది. మీ పేజీ ఎందుకు నమ్మదగినదో మీరు చూసుకునేందుకు సులువుగా ఉండడానికి మీ ప్రశ్నలోని పదాలకు సరిపోయే పదాలను దొరకబుచ్చుకున్న వెర్షన్ పై హైలైట్ చెయ్యబడతాయి.

విషయసూచికలో లేని సైట్ లకు "దొరకబుచ్చుకున్న" లింకు ఉండదు మరియు ఎవరైనా సైట్ సొంతదారులు అభ్యర్ధస్తే వారి సైట్ లలోని విషయాలను మేము క్యాచ్ చెయ్యము.

Google
... మాతో అడ్వర్టైజ్ చెయ్యండి - వ్యాపార పరిష్కారాలు - సేవలు మరియు పరికరాలు - ఉద్యోగాలు,
పత్రికలు, మరియు సహాయం ©2011 Google - శోధించడం 4,285,199,774 వెబ్ పేజీలు.
www.google.com/ - 3k - నవంబర్ 26, 2004 -
» భద్రపరిచినది « - పోలిక గల పేజీలు



క్యాలిక్యులేటర్

క్యాలిక్యులేటర్ Google లో అంతర్గత నిర్మితమైయున్న క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి, శోధన పెట్టెలో మీరు చేయాలనుకున్న లెక్కను సులువుగా ఎక్కించి ఎంటర్ కీ లేదా Google శోధన బటన్ నొక్కండి. సాధారణ అర్ధమేటిక్, ఎక్కువ క్లిష్టమైన లెక్క, కొలతలు మరియు అనువాదాలు, మరియు భౌతిక విషయాలను కాలిక్యులేటర్ పరిష్కరించగలదు. క్రిందనున్న నమూనా భావవ్యక్తీకరణలను ప్రయత్నించు, లేదా మీకు మీరుగా తయారు చేసుకోవడానికి మా పూర్తి సూచనలను పరిశీలించండి.

ఈ కొత్త విశిష్టత యొక్క ఉపయోగాన్ని మరియు సామర్ధ్యాన్ని ఈ నమూనా ప్రశ్నలు ప్రదర్శిస్తాయి:

ఉదాహరణ:  


కరెన్సీ మార్పిడి

మా అంతర్నిర్మిత కరెన్సీ కన్వర్టర్ ని ఉపయోగించడానికి, Google శోధన పెట్టెలో మీరు మార్చాలనుకుంటున్న దానిని చేర్చి "ఎంటర్" నొక్కండి లేదా Google శోధన బటన్ ని క్లిక్ చెయ్యండి.

ఇవి కొన్ని నమూనా ప్రశ్నలు:

ఉదాహరణ:  


నిర్వచనాలు

ఒక పదం లేదా పదసమూదాయానికి నిర్వచనం కోసం , కేవలం "నిర్వచించు" అని టైపు చేసి ఒక ఖాళీ ఇచ్చి, ఆతర్వాత మీకు నిర్వచనం కావాలనుకున్న పదం(లు) వ్రాయండి. Google ఒక పదానికి లేదా పదసముదాయానికి వెబ్ పై నిర్వచనాన్ని చూస్తే, ఆ సమాచారాన్ని సేకరించి దానిని మీ శోధన ఫలితాల పైభాగంలో ప్రదర్శిస్తుంది.

ఉదాహరణ:  
ప్రత్యేక కార్యవర్తనం "define:" ని చేర్చడం ద్వారా మీరు నిర్వచనాల జాబితాను కూడా పొందవచ్చు: దానికి మరియు మీరు నిర్వచనం పొందాలనుకుంటున్న పదానికి మధ్య ఖాళీ లేకుండా ఉదాహరణకి, [define: janmadinam] శోధన "జన్మదినం "కి పలు ఆన్ లైన్ మూలాలనుండి సేరకించిన నిర్వచనాల జాబితాను చూపిస్తుంది.


ఫైల్ రకాలు

Google తన HTML కాని ఫైల్ రకాల శోధన సంఖ్యను 12 ఫార్మాట్లకు పెంచింది. PDF డాక్యుమెంట్లకు తోడుగా, Google ఇప్పుడు Microsoft Office, PostScript, Corel WordPerfect, Lotus 1-2-3, మరియు ఇతరాలను శోధిస్తుంది. Google శోధన ఫలితాలలో కొత్త ఫైల్ రకాలు ఉపయోగించువారి ప్రశ్నలకు సంబంధం ఉన్నపుడు వాటికవే కన్పిస్తాయి

వాడకందారుడు "HTMLగా చూపించు" లా చూసుకునే సదుపాయాన్ని కూడా Google కల్పిస్తోంది, సంబంధిత ఉపకరణం స్థాపించబడకపోయినా వాడకందారులను దీని ఫైల్ ఫార్మాట్ల కంటెంట్ ని పరిశీలించే అవకాశం కల్పిస్తోంది. "HTMLగా చూపించు" సదుపాయం కొన్ని ఫైల్ ఫార్మాట్ లతో వచ్చే వైరస్ ల నుండి వాడకందారుడు తప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

మొత్తంమీద, Google వాడకందారులకు అదనపు ఫైల్ రకాలు వరల్ట్ వైడ్ వెబ్ పై అందుబాటులోనున్న కంటెంట్ ని పూర్తిగా చూసే అవకాశాన్నిస్తుంది. మరియు Google రాబోయే కాలంలో అందుబాటులోనున్న ఫైల్ రకాలను మరింత పెంచే ప్రణాళికలు రచిస్తోంది.

ఈ ప్రధానవిశిష్టత కి సంబంధించిన మరింత సమాచారం కొరకు, దయచేసి ఫైల్ రకాల త.అ.ప్రలను చదవండి.

» [PDF] « శోధన ఇంజిన్ యొక్క అనాటమీ
ఫైల్ రకం: PDF/Adobe Acrobat - » HTML లా చూపించు «
... రెండవది, Google ఫాంటు... ఫోన్
నంబర్లు, ఉత్పాదన నంబర్లు), ఫార్మాట్ రకం (కధనం, HTML, PDF, చిత్రాలు, శబ్దాలు ...
వంటి కొన్ని కన్పించే ప్రదర్శనల వివరాను ట్రాక్ చేస్తుంది. www-db.stanford.edu/pub/papers/google.pdf - పోలిక గల పేజీలు

ఒక ప్రత్యేకమైన ఫలితాలను ప్రత్యేకమైన ఫైల్ రకంతో చూడాలనుకుంటే (ఉదాహరణకి, PDF లింకులు), శోధన పెట్టెలో మీ శోధన పదం(లు)ని filetype:[extension] (ఉదాహరణకి, filetype:pdf) అని టైపు చెయ్యండి.

ఉదాహరణ:  

ఉత్పాదన శోధన

ఉత్పాదన శోధన Google ఉపయోగించే ఉత్పాదనలను మీరు శోధిస్తే, మీరు సంబంధిత ఉత్పాదన శోధన సమాచారాన్ని మరియు మీ శోధన ఫలితాల పై ప్రదర్శించబడిన లింకులను చూడగలరు. ఈ ఉత్పాదన శోధన ఫలితాలు ఉత్పాదన శోధన, Google ఉత్పాదన శోధన సేవలో పాలుపంచుకునే వ్యాపారుల సైట్లతో లింకు చెయ్యబడి ఉంటాయి. వ్యాపారులకు ఉత్పాదనల శోధనలో పాల్గొనడం పూర్తిగా ఉచితమైనట్లుగా, ఈ ఫలితాలు ప్రకటనలు కావు.

ఉదాహరణ:  

గ్రూపులు

గ్రూపులు మీరు Google పై శోధిస్తున్నపుడు, కొన్నిసార్లు మీ శోధన ఫలితాల పేజీ క్రింద నుంచి వచ్చిన Google గ్రూపుల ఫలితాలను చూస్తారు. ఇవి వాడకందారులు చర్చా గ్రూపుకు పంపిన మీరు వెతుకుతున్న విషయానికి సంబంధించిన సందేశాలు. ఈ ఫలితాలలో ఒకదానిపై క్లిక్ చేస్తే Google గ్రూపుల సైట్ పై ఉన్న ఈ సందేశం యొక్క పూర్తి కధనాన్ని మీ ముందుంచుతుంది.

ఉదాహరణ:  

నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను

"నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను™" బటన్ మిమ్మల్ని నేరుగా Google మీ ప్రశ్నకు చూపించిన మొదటి వెబ్ పేజీకి తీసుకుపోతుంది. మీరు ఇతర శోధన ఫలితాలను ఎంతమాత్రం చూడలేరు. ఒక "నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను" శోధన అంటే వెబ్ పేజీలను వెతకడానికి తక్కువ మరియు వాటిని చూడడానికి ఎక్కువ సమయం ఖర్చు చెయ్యి అని అర్ధం.

ఉదాహరణకి, నాగార్జున యూనివర్శిటీ హోం పేజీని పొందడానికి, కేవలం శోధన క్షేత్రంలో nagarjuna universityఅని ఎంటర్ చేసి "నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను" బటన్ పై క్లిక్ చెయ్యండి. Google మిమ్మల్ని నేరుగా "www.nagarjunauniversity.ac.in", నాగార్జున యూనివర్శిటీ యొక్క అధీకృత హోం పేజీకి తీసుకుపోతుంది.

ఉదాహరణ:  
మీరు అదృష్టవంతుడిగా భావిస్తున్నారా?


చిత్రాలు

మీరు అప్పుడప్పుడు మీ Google శోధన ఫలితాల పైభాగంలో చిన్న చిన్న చిత్రాలను చూడగలుగుతారు. ఇవి మీ శోధనకు సంబంధించినవిగా మేము భావిస్తున్న చిత్రాలు.

Google చిత్రాల శోధన ద్వారా, లేదా మీరు తరచుగా వెబ్ శోధన చేస్తున్నపుడు మీ శోధన పదాలకు 'చిత్రం' లేదా 'చిత్రాలు' అని చేర్చడం ద్వారా మీరు మీకు కావలసిన చిత్రాలను పొందవచ్చు.

ఉదాహరణ:  

స్థానిక శోధన

స్థానిక శోధన మీ సమీపంలోని ప్రత్యేకమైన ప్రదేశంలో స్టోర్స్ లేదా వ్యాపారాల కోసం మొత్తం వెబ్ ని వెతకడానికి Google సహాయపడుతుంది. ఒక నగరం లేదా పిన్ కోడ్ ని మీ శోధనలో చేర్చండి మరియు Google ఆ ప్రాంతానికి సంబంధించిన రివ్యూలు, మార్గాలు, మరియు మరింత సమాచారాన్ని మీ శోధన ఫలితాలపై భాగంలో ప్రదర్శిస్తూ ఒక పటము ద్వారా మీ ముందుంచుతుంది.

ఉదాహరణ:  

సినిమాలు

సినిమాలు మీ సమీపంలో ప్రదర్శింపబడుతున్న సినిమాల రివ్యూలు, ఆటల సమయాలను పొందడానికి, "సినిమాలు", "ఆటల సమయాలు" లేదా ప్రస్తుత సినిమా పేరును Google శోధన పెట్టెలో చేర్చండి. Google స్థానిక ద్వారా మీరు ఇప్పటికే మీ స్థానాన్ని చేర్చుకుని ఉంటే, శోధన ఫలితాల పైభాగంలో మీ ప్రాంతంలో మీరు సూచించిన సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వివరాలను ప్రదర్శిస్తుంది.

ఉదాహరణ:  

మీ సమీపంలోని మీ సినిమాను ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లను మరియు ఆటల సమయాలను పొందడానికి, కేవలం సినిమా పేరుతో శోధించండి.

ఉదాహరణ:  

సినిమా పేరును గుర్తుంచుకోవడం వీలుకాదు, లేదా ఇంకేదైనా కొత్త దానికోసం చూస్తున్నా? మీరు "movie:" ఆపరేటర్ ను ప్రత్యేక నటుడు, దర్శకుడు లేదా కథ వివరాలకు సంబంధించిన సినిమాలను శోధించడానికి ఉపయోగించుకోవచ్చు.

ఉదాహరణ:  

మీరు పొందిన సినిమాల గురించి చదవాలనుకుంటున్నారా? ఏదైనా సినిమా కోసం మీ చేసే శోధన ఫలితాలలో ఐదుగురు నటులలో సరాసరి రేటింగ్ మరియు ఆన్ లైన్ రివ్యూలనుండి కొన్ని భాగాలు, వాటితోపాటు వాటిని పొందడానికి లింకులు వంటి వివరాలుంటాయి. ఏదైనా సినిమా పేరు దగ్గర దాని పూర్తి ఆన్ లైన్ రివ్యూలకోసం "రివ్యూలు" లింకుని క్లిక్ చెయ్యండి.

సంగీత శోధన

మీరు వెతుకుతున్న సంగీతానికి సంబంధించిన కళాకారులు, పాటలు, ఆల్బమ్ లు మరియు అవి దొరికే ప్రదేశాలను పొందండి. శోధన పెట్టెలో అమెరికాలో పేరున్న ఒక కళాకారుని పేరు మీరు ఎంటర్ చేస్తే, మేము వాడకందారుల రివ్యూలు, పాటల వివరాలు, అవి లభించే దుకాణాలు మరియు ఆ కళాకారుని ఇతర అవసరమైన సమాచారాన్ని మీ శోధన ఫలితాల పైభాగంలో ప్రదర్శిస్తాము.

ఉదాహరణ:  

  పిక్సీస్
ఆల్బమ్ లు: డూలిటిల్, సర్ఫర్ రోసా, పిక్సీస్, ఇంకా మరెన్నో...
పాటలు: డెబాసెర్, వేవ్ ఆఫ్ మ్యూటిలేషన్, సిల్వర్, ఇంకా మరెన్నో...
మరిన్ని సంగీత ఫలితాలు పిక్సీస్ కోసం 

ఆ కళాకారుడి గురించి సంబంధిత ఆల్బమ్ లు, పాటలు, ఇంకా ఎన్నో వంటి మరింత సంగీత సమాచారం తెలుసుకోవడానికి లింకుపై క్లిక్ చెయ్యండి.

వార్తల ముఖ్యాంశాలు

 మీరు Google పై శోధిస్తున్నపుడు మీరు "వార్తలు" అని మార్క్ చేసిన లింకులను మీ ఫలితాల పై భాగంలో చూడవచ్చు. Google నిరంతరం పరిశీలించే అనేక వార్తా సంస్థల రిపోర్టులకు ఈ లింకులు మిమ్మల్ని కలుపుతాయి. ప్రస్తుత వార్తలలోని పదాలను మీరు ఎంటర్ చేస్తే ఆ లింకులు కన్పిస్తాయి మరియు వాటిపై క్లిక్ చేయడంవలన మిమ్మల్ని నేరుగా వాటిని అందించే సేవలను చేరుస్తాయి.

ఉదాహరణ:  

ఫోన్ బుక్

ఫోన్ బుక్ అమెరికాలోని వీధుల చిరునామాలు మరియు ఫోన్ నంబర్లను పొందే సౌకర్యాన్ని మా శోధన పెట్టె ద్వారా ఇచ్చే సమాచారంతో Google అందిస్తోంది. ప్రత్యేక పదాలతోకూడిన శోధన ఫలితాలలో పబ్లిక్ గా జాబితాగా రూపొందిన ఫోన్ నంబర్లు మరియు చిరునామాలను ఫలితాల పేజీ పై భాగంలో మీరు చూస్తారు.

ఒక అమెరికా నివాసానికి సంబంధించిన జాబితాను పొందడానికి, Google శోధన పెట్టెలో ఏవైనా ఈ క్రింది వివరాల కలయికను టైపు చెయ్యండి:

  • మొదటి పేరు (లేదా మొదటి పొడి అక్షరం), చివరి పేరు, నగరం (రాష్ట్రం ఐచ్చికం)
  • మొదటి పేరు (లేదా మొదటి పొడి అక్షరం), చివరి పేరు, రాష్ట్రం
  • మొదటి పేరు (లేదా మొదటి పొడి అక్షరం), చివరి పేరు, రాష్ట్రం
  • మొదటి పేరు (లేదా మొదటి పొడి అక్షరం), చివరి పేరు, రాష్ట్రం
  • స్థానిక కోడ్ తో పాటు ఫోన్ నంబర్
  • చివరి పేరు, నగరం, రాష్ట్రం
  • చివరి పేరు, జిప్ కోడ్

మీ ఇంటి ఫోన్ మరియు చిరునామా సమాచారాన్ని Google ఫోన్ బుక్ నుంచి తొలగించడానికి, ఇక్కడ క్లిక్ చెయ్యండి.


ప్రశ్నలు మరియు జవాబులు

హైదరాబాద్ యొక్క జనాభా తెలుసుకోవాలనుకుంటున్నారా? అల్జీరియా ఉపయోగించే కరెన్సీ పేరేమిటి? బోనో పుట్టిన ప్రదేశమేది? Google శోధన పెట్టెలో టైపు చెయ్యడం ద్వారా ఒక యదార్ధ సంబంధమైన ప్రశ్న లేదా వివరణ మమ్మల్ని అడగండి ("హైదరాబాద్ జనాభా" లాంటివి). మేము వెబ్ ని శోధించి ఆ వివరాలను మీ శోధన ఫలితాల పేజీపై భాగంలో ప్రదర్శిస్తాము. మీరు మరింత తెలుసుకోవడానికి ఈ సమాచారం కోసం మేము మా మూలాలను కూడా లింకు చేస్తాము.

ఉదాహరణ:  

మీ శోధనను శుద్ధిచెయ్యి

కొన్ని టాపిక్ లలో శోధనల కొరకు, మీ శొధనను వేగవంతం చేయడంలో సహాయపడే లింకులను ఫలితాల పేజీ పైభాగంలో మీరు గమనిస్తారు.



ఈ లింకులే కొన్ని వెబ్ పేజీలకు కేటాయింపబడిన లేబుల్స్. సంస్థలు, వ్యాపారాలు మరియు వ్యక్తులు వారికి అత్యుత్తమంగా తెలిసిన టాపిక్స్ లో వెబ్ సైట్ లకు ఈ లేబుల్స్ ఇవ్వవచ్చు. Google కో-ఆపరేటివ్ డైరెక్టరీ ని నేరుగా సందర్శించడం ద్వారా మీరు ఆ సంస్థలకు చందాదారులు కావచ్చు.

ఉదాహరణ:  
ఉదాహరణ:  

రెస్టారెంట్ రిజర్వేషన్లు, ఆర్ధిక సమాచారాలు, లేదా సెలబ్రిటీల గురించి కబుర్లను కూడా Google కో-ఆపరేటివ్ డైరెక్టరీ లో చందా లింకుల ద్వారా మీ శోధన ఫలితాలలో తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. మీ అభీష్టం మేర అందించే వారికి చందాదారులుగా చేరుతూ ఈ సేవలను మీ Google శోధనకు జతచేయండి.


ఫలితాలను ముందే పొందడం

కొన్ని శోధనలలో, మీరు క్లిక్ చేయకముందే Google తనంతట తానుగా పైన శోధించిన ఫలితాలను డౌన్ లోడ్ చేయడం ప్రారంభించవలసిందిగా మీ బ్రౌజర్ ను ఆదేశిస్తుంది. మీరు పై ఫలితంపై క్లిక్ చేసినట్లయితే, ఇంతకు ముందెన్నడూ లేనంత వేగంగా మీరు చేరవలసిన పేజీ లోడ్ అవుతుంది.

Firefox మరియు Mozilla వెబ్ బ్రౌజర్ లలో ఈ సౌకర్యం అందజేయడంకోసం Google ఒక ప్రత్యేకమైన ముందేపొందే విశిష్టత ఉపయోగిస్తుంది, అందుకే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లేదా ఇతర వెబ్ బ్రౌజర్ లలో ఫలితాలను ముందేపొందడం అందుబాటులో లేదు. మీ వెబ్ బ్రౌజర్ ఎంపికలనుండి Mozilla ముందేపొందే త.అ.ప్ర లో వివరించిన విధంగా ముందేపొందడాన్ని తొలగించుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ లో, ఈ క్రింది విధంగా చేయడంద్వారా ముందేపొందడాన్ని తొలగించవచ్చు.

  1. చిరునామా బార్ లో "about:config" అని టైపు చెయ్యండి.
  2. "network.prefetch-next" కి స్క్రోల్ చేసి విలువను "False"గా సెట్ చెయ్యండి.

ముందే పొందడం ఎనేబుల్ అయ్యుంది, మీరు Google శోధన ఫలితాల పేజీలను చూసినపుడు ముందుగా పొందడం దానికదే జరుగుతుంది కాబట్టి మీ వెబ్ బ్రౌజర్ క్యాచ్ లో వెబ్ సైట్ ల నుండి కుకీలు మరియు వెబ్ పేజీలు వచ్చి చేరతాయి. మీ బ్రౌజర్ క్యాచ్ మరియు కుకీలను తొలగించడం ద్వారా మీరు ఈ ఫైళ్లను తొలగించవచ్చు.

మీరు ఒక వెబ్ సర్వర్ ని నడిపినట్లైతే, మీరు వెబ్ మాస్టర్-సంబంధిత సమాచారాన్ని ఈ సదుపాయం గురించి వెబ్ మాస్టర్ త.అ.ప్ర లో పొందవచ్చు.

సంఖ్యతో శోధన

పార్సెల్ ట్రాకింగ్ ఐడిలు, పేటెంట్లు మరియు ఇతర ప్రత్యేక సంఖ్యలను Google యొక్క శోధన పెట్టెలో చేర్చి వాటి సమాచారాన్ని త్వరితంగా పొందవచ్చును. ఉదాహరణకి, ఒక FedEx ట్రాకింగ్ సంఖ్యని టైపు చెయ్యడం ద్వారా మీ ప్యాకెట్ తాజా సమాచారాన్ని పొందగలుగుతారు. సంఖ్యల రకాలతో ఇతర ప్రత్యేక శోధనలలో :

యూపిఎస్ ట్రాకింగ్ సంఖ్యలు ఉదాహరణ శోధన: "1Z9999W99999999999"
FedEx ట్రాకింగ్ సంఖ్యలు

దాహరణ శోధన: "999999999999"

USPS ట్రాకింగ్ సంఖ్యలు ఉదాహరణ శోధన: "9999 9999 9999 9999 9999 99"
వాహన ఐడి (విఐఎన్) సంఖ్యలు ఉదాహరణ శోధన: "AAAAA999A9AA99999"
యుపిఎస్ కోడ్ లు ఉదాహరణ శోధన: "073333531084"
టెలిఫోన్ ప్రాంతీయ కోడ్ లు ఉదాహరణ శోధన: "650"
పేటెంటు నంబర్లు దాహరణ శోధన: "patent 5123123"
"patent" అనే పదాన్ని మీ పేటెంట్ నంబర్ కి ముందు చేర్చడం మరచిపోవద్దు.
ఉదాహరణ:  
Google మరేవైనా ఇతర సంఖ్యలను మీరు శోధించాలనుకుంటున్నారా? దయచేసి మమ్మల్ని సంప్రదించండి.


పోలిక గల పేజీలు

ఒక శోధన ఫలితంకోసం మీరు "పోలిక గల పేజీలు" లింకుపై క్లిక్ చేసినట్లయితే ఈ ఫలితాలకు సంబంధించిన వెబ్ పేజీలను Google తనంతటతానే ప్రదర్శిస్తుంది.

పోలిక గలపేజీల అంశాన్ని అనేక ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఒక ప్రత్యేకమైన సైట్ లోని విషయం మీకు నచ్చుతుంది కాని మరిన్ని విషయాలు ఉంటే బాగుండునని మీరనుకున్నట్లయితే, అదే విషయాలు కలిగి, మీకు బాగా తెలియని సైట్ లను పోలిన పేజీలు వెతికి చూపిస్తుంది. మీరు ఉత్పాదన సమాచారం కొరకు చూస్తున్నట్లయితే, పోటీపడే సమాచారాన్ని పోలికగల పోజీలు మీకు చూపగలదు, అప్పుడు మీరు నేరుగా పోల్చుకుని చూడవచ్చు. మీకు ఒక ప్రత్యేక క్షేత్రంలో పరిశోధన చేయడంలో ఆసక్తి ఉంటే, సరైన కీలక పదాలను ఎంచుకోవడానికి ఎక్కువ శ్రమ పడకుండా పెద్ద సంఖ్యలో సమాచార సాధనాలను వేగంగా కనుగొనడంలో పోలిన పేజీలు మీకు సహాయపడుతాయి.

ఒక పేజీ ఎంత ఎక్కువ ప్రత్యేకతలు కలిగిఉంటే అంత తక్కువ ఫలితాలను Google మీకు అందించ గలుగుతుంది. ఉదాహరణకు, మీ వ్యక్తిగత హోం పేజీతో ఇతర పేజీలను హక్కుగా జతపరచడానికి తగినంత సమాచారం మీ పేజీలో లేనట్లయితే, పోలిక గల పేజీలు పోలిక గల పేజీలు మీ వ్యక్తిగత హోం పేజీకి సంబంధిత పేజీలను వెతకలేక పోవచ్చు. మరియు, కంపెనీలు వారి పేజీలకు పలు URL లను ఉపయోగించినట్లయితే (company.com మరియు www.company.com వంటి) పోలిన పేజీలలో ఆ URL పై తక్కువ సమాచారం ఉండవచ్చు, కాని ఇతరములపై ఎక్కువ సమాచారం ఉండవచ్చు. సాధారణంగా, ఏమైనాకాని, ఎక్కువశాతం వెబ్ పేజీలకు పోలిక గల పేజీలు చాలా బాగా పనిచేస్తాయి.

Google
... మాతో అడ్వర్టైజ్ చెయ్యండి - వ్యాపార పరిష్కారాలు - సేవలు మరియు పరికరాలు - ఉద్యోగాలు,
పత్రికలు, మరియు సహాయం ©2011 Google - శోధించడం 4,285,199,774 వెబ్ పేజీలు.
www.google.com/ - 3k - నవంబర్ 26, 2004 -
» భద్రపరచినది « - పోలిక గల పేజీలు



సైట్ శోధన

"site" అనే పదం తర్వాత కోలన్ పెడితే అది మీ శోధనను ఒక నిర్దిష్టమైన సైట్ కి పరిమితం చేస్తుంది. ఇది చేయడానికి, Google శోధన పెట్టెలో site:sampledomain.com సింటాక్స్ ని ఉపయోగించండి. ఉదాహరణకు, నాగార్జున యూనివర్సిటీ సైట్ లో అడ్మిషన్ సమాచారం కొరకు ఈ క్రింది విధంగా ఎంటర్ చేయండి:

ఉదాహరణ:  

స్పెల్ చెకర్

Google యొక్క స్పెల్ చెకర్ సాప్ట్ వేర్ తనకుతానుగా మీ ప్రశ్నకోసం చూస్తుంది మరియు మీరు అత్యంత సాధారణమైన వర్డ్ స్పెల్లింగ్ వెర్షన్ ని ఉపయోగిస్తున్నారా లేదా అని చూస్తుంది. ఇది మీరు వేరొక స్పెల్లింగ్ తో ఫలితాలను పొందబోతున్నారు అని తెలిస్తే, అది మిమ్మల్ని "మీరు అనుకుంటున్నారా: (మరింత సాధారణ స్పెల్లింగ్)?"అని అడుగుతుంది. చూపించిన స్పెల్లింగ్ ని క్లిక్ చెయ్యడం ద్వారా ఆ పదానికి Google శోధన మొదలవుతుంది. Google యొక్క స్పెల్ చెక్ అనేది ఇంటర్నెట్ లోని అన్ని పదాల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, సాధారణ స్పెల్ చెక్ ప్రోగ్రాములు లేదా డిక్షనరీలలో కన్పించనటువంటి విధంగా నామవాచకాలకు (పేర్లు మరియు ప్రదేశాలు) కూడా ఇది స్పెల్లింగ్ ని చూపిస్తుంది.


• స్టాక్ మరియు ఫండ్ ధర తెలపడం

స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్ ధరలను తెలుకుకోవడానికి Google ని ఉపయోగించాలంటే, శోధన పెట్టెలో గుర్తును ఎంటర్ చేయండి.

ఉదాహరణ:  
Cisco

Google ఫైనాన్స్ నుండి మరింత సమాచారం చూడడానికి పట్టికపై గాని లేదా Google ఫైనాన్స్ లింకుపై కాని క్లిక్ చేయండి. అంతేకాకుండా, మీరు మరింత సమాచారం కొరకు అక్కడ పొందుపరచిన లింకులపై క్లిక్ చేయడంద్వారా ఆర్ధిక సమాచారం అందించే ఇతరులను కూడా చూడవచ్చు. ఈ ఆర్ధిక సమాచారాన్నందించేవారిని ఎంచుకోవచ్చు మరియు స్వతంత్ర త్రిముఖ శ్రోతల కొలత సంస్థల ఆధారంగా నిర్ణయించిన వీరి జనాదరణను పరిగణనలోకి తీసుకుని ఆదేశించవచ్చు. అదనంగా, డౌన్ లోడ్ వేగం, యూజర్ ఇంటర్ ఫేస్ మరియు పనితీరు వంటి ముఖ్యమైన నాణ్యతాంశాలను మేము పరిగణనలోకి తీసుకుంటాము. మీరు ఒక ప్రొవైడర్ ను సూచించదలుచుకుంటే మేము చేర్చుకుంటాము, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.


వీధి మ్యాపులు

మ్యాప్ ఐకన్

వీధి మ్యాపులు పొందడానికి Google ని ఉపయోగించడానకి, Google శోధన పెట్టెలో జిప్ కోడ్ లేదా పట్టణం/రాష్ట్రంతో సహా అమెరికాలోని వీధి చిరునామా (ఉదా. 165 University Ave Palo Alto CA) ఎంటర్ చేయండి. తరచుగా, వీధి చిరునామా మరియు పట్టణం పేరు సరిపోతాయి.

ఉదాహరణ:  

Google పటము అభ్యర్ధనగా మీ ప్రశ్నను గుర్తించినపుడు, Google మ్యాపులో మీ చిరునామా చూపుతాము మరియు మీరు దిక్కులను గుర్తించి వాటిని మీ డిఫాల్ట్ లొకేషన్ లో భద్రపరుచుకునే వీలు కల్పిస్తాము.


ప్రయాణ సమాచారం

ఒక ప్రత్యేక విమానాశ్రయంలోని ఆలస్యాలు మరియు వాతావరణ పరిస్థితిని చూడడానికి, ఆ నిమానాశ్రయం యొక్క మూడక్షరాల కోడ్ తో "ఎయిర్ పోర్ట్" ను టైపు చేయండి. ఉదాహరణకు, హైదరాబాద్ సంబంధించిన సమచారం "HYD airport" ను శోధించడంద్వారా తెలుసుకోవచ్చు.

ఉదాహరణ:  
ఒక అమెరికా విమాన స్థితిని తెలుసుకోవడానికి, విమానయానం పేరు దానితర్వాత విమానం నెంబరు టైపు చెయ్యండి. ఉదాహరణకు, యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం 134 యొక్క స్థితికొరకు "United 134" అని శోధించండి.

ఉదాహరణ:  


వాతావరణం

అమెరికా లోని ఒక ప్రత్యేక ప్రదేశం లేదా ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనిదైనా వాతావరణ స్థితి మరియు రాబోయే నాలుగు రోజుల వాతావరణం కొరకు "weather", తర్వాత ఆ ప్రదేశం పేరు టైపుచేయండి. సాధారణంగా, ఒక పట్టణం పేరు చాలు, కాని ప్రపంచంలోని పట్టణాలకోసం రాష్ట్రం లేదా జిప్ కోడ్ లేదా దేశం కూడా చేర్చవలసి ఉంటుంది. ఉదాహరణకు, పాలో ఆల్టో వాతావరణంకోసం మీరు "weather palo alto, ca" లేదా "weather palo alto 94301" అని శోధించవలసి ఉంటుంది.

మీరు మీ వ్యక్తిగత Google హోమ్ పేజీలో ఆ ప్రదేశం యొక్క వాతావరణం చూడాలనుకుంటే, పైభాగంలో కుడి మూలలోని 'నా Google హోం పేజికి చేర్చు' పై క్లిక్ చేయడంద్వారా ఆ పని చేయవచ్చు.

ఉదాహరణ:  

అన్ని వాతావరణ స్థితులు మరియు రాబోయే వాతావరణాన్ని Weather Underground, Inc అందిస్తుంది.


వెబ్ పేజి అనువాదం

అనువాదం అనే ఈ అంశం ద్వారా Google భాషాపరమైన అవాంతరాన్ని ఛేదించింది. యంత్ర అనువాద టెక్నాలజీని ఉవయోగించి ఇతర భాషలలోని వెబ్ పేజీలలో మీ ప్రవేశానికి అవకాశం ఇప్పుడు Google మీకు కల్పిస్తోంది. ప్రస్తుతం, ఈ క్రింది అనువాద భాషా జంటలను Google మీకు అందిస్తోంది. ఇంగ్లీషు నుండి అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, స్పానిష్ మరియు పోర్చుగీస్ మరియు జర్మన్ నుండి ఫ్రెంచ్.

ఈ భాషలలో ఏదైనా ఒకటి మీ శోధన ఫలితాలలో ఉంటే మేము మీ భాష జంటకు సహకరిస్తాము, మీరు ఆ పేజీని ఒకే ఒక క్లిక్ తో మీ భాషలోకి అనువదించుకోవచ్చు

ఈ ప్రధానలక్షణానికి సంబంధించిన మరింత సమాచారం కొరకు, దయచేసి ఫైల్ రకాల త.అ.ప్రలను చదవండి.

Répertoire Web de Google - World > Français - » [ ఈ పేజీని అనువదించండి ] «
... Modifié par Google - ©2011 Google Aide du répertoire
Google - À propos - ఇంగ్లీషులో Google .
directory.google.com/Top/World/ - 7k - మార్చ్ 26, 2004 - భద్రపరచినది - పోలిక గల పేజీలు



• మీకు ఎవరు కలిశారు ?

కొన్ని పదాలకు కోలన్ చేరిస్తే, Google లో ఒక ప్రత్యేకమైన అర్ధం ఉంటుంది. Google కి అలాంటి పదం link: ఆపరేటర్. link:siteURL అనే ప్రశ్న ఆ URLకు సంబంధించిన పేజీలను చూపిస్తుంది. ఉదాహరణకు, link:www.google.com మీకు Google హోం పేజీకి సంబంధించిన పేజీలను చూపిస్తుంది. మీరు లింక్: ని కలుపలేరు మామూలు కీ వర్డ్ శోధనతో శోధించు.

ఉదాహరణ: